గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ
వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని
తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయపథంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల
శక్తిని ఇస్తుంది.
అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం,
నిరాశావాదం - ఈ ఐదూ అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా
జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు.
బలవంతుడికీ బలహీనుడికీ మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షకపాత్ర వహించడమంటే తటస్థంగా ఉన్నట్లు కాదు, బలవంతుడి పక్షం వహించినట్లు.
ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం... ఈ రెండూ వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి.
నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచం లో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.